సామాన్య రైతుగా మారిన మినిస్టర్..
ఆయన ఏపీ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పటికీ సామాన్య రైతులా పొలం పనులు చేస్తున్నారు. ఆయన ఇలా పొలం పనులు చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి పొలం పనులు చేయడం ఏంటని స్థానికులు చర్చించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి కి కొంత తీరిక దొరికితే చాలు.. ఆయన పొలం పనుల్లో నిమగ్నమైపోతారు. సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచీ ఆయనకు పొలం పనులంటే చాలా ఇష్టం. కళాశాల అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడూ వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశారు. తీరిక సమయంలో పొలం వెళ్లి పని చేయడం నిజమైన సంతృప్తినిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.

