సెల్ ఫోన్ వెలుగులోనే మంత్రికి చికిత్స
మహరాష్ట్రలోని జౌరంగాబాద్‌లో గల ఘటి ఆసుపత్రిలో కేబినేట్ మంత్రి సందీపన్ భుమ్రే తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడి వైద్యులతో ఆయన దంత పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని సూచించడంతో , వెంటనే చికిత్స ప్రారంభించమని మంత్రి వైద్యులను కోరారు. సత్వరమే వైద్యులు దీనికి సంబంధించిన చికిత్సను ప్రారంభించగా.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంలో చేసేది ఏమీ లేకా సెల్‌ఫోన్స్ వెలుగులోనే చికిత్స పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జనరేటర్ కావాలని కొంతకాలంగా ఎన్నో విజ్ఞప్తులు చేసినట్టు వైద్యులు తెలిపారు. వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు వెంటనే జరగాలని సంబంధిత అధికారులకు సందీపన్ ఆదేశాలు జారీచేశారు.

