Home Page SliderTelangana

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పితృ వియోగం

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి గారు నేటి ఉదయం స్వర్గస్తులయ్యారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పురుషోత్తమ్ రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సహా రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూరాలని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు. పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ సంతాపాన్ని ప్రకటించారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రి అన్నారు.

పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు.