ఉజ్జయినిలో మహాదేవునికి ఉత్తమ్ దంపతులు ప్రత్యేక పూజలు
ఉజ్జయిని మహాకాళేశ్వరం జ్యోతిర్లింగ ఆలయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తమ్ దంపతులు స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని దేశంలోనే శైవ క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది.

