చినజీయర్ స్వామిని కలిసిన మంత్రి తుమ్మల
ఖమ్మం: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఫిబ్రవరి 20న నిర్వహించనున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీరామనగరం కుటీరంలో చినజీయర్ స్వామిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని చినజీయర్ స్వామి శాలువాతో సన్మానించి మంగళశాసనాలు అందజేశారు. కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు పాల్గొన్నారు.

