Home Page SliderTelangana

భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కేరళ సీఎంని కోరిన మంత్రి సీతక్క

తెలంగాణ: రెండు తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలైకి వెళ్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. ముఖ్యంగా బాలస్వాములు దర్శనం కోసం లైన్లలో సుమారు 15 గంటల పాటు నిల్చొని అలసిపోతున్నారని తెలిపారు. వారికి కనీసం తాగడానికి కూడా నీరు అందించలేని పరిస్థితి అక్కడ ఉందని తనకు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.