నల్గొండలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
నల్గొండ: జిల్లాలో చోటుచేసుకున్న కన్నబిడ్డ విక్రయ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మంత్రి సీతక్క శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాలతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణం పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై తక్షణ విచారణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

