కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం
కర్నూలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు.
“మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి తక్షణ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నాం. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్‌ను గాయపడిన వారికి సమయానుకూల వైద్యసహాయం అందించాలంటూ ఆదేశించాను,” అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అదనంగా, ప్రమాద కారణాలు వెలికితీసేందుకు FSL టీమ్‌లను సంఘటన స్థలానికి పంపినట్లు కూడా మంత్రి తెలిపారు.

