Andhra PradeshNews

పవన్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఫైరయ్యారు. ఏపీ సీఎం జగన్‌పై ఆదివారం పవన్‌కళ్యాణ్‌ విమర్శించిన నేపథ్యంలో రోజా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు జాతకం చెబుతుంటే నవ్వొస్తోందని అన్నారు. 45 సీట్లే వైసీపీకి వస్తే.. 135 సీట్లు మీకు వస్తాయా? అని పవన్‌ను రోజా నిలదీశారు. ఇది విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పవన్‌కు 175 సీట్లలలో పోటీ చేసే అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి సర్వేలను నమ్ముకుని జగన్‌ సీఎం కాడు, కాలేడు.. ఇదే నా శాసనం అన్నావని ఆమె గుర్తు చేశారు. సినీ పరిశ్రమలోని హీరోలంతా నిన్ను హీరో అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపగలననే నమ్మకం వుంటే, నీకు దమ్ము, ధైర్యం వుంటే జగన్‌తో సింగిల్‌గా పోటీ చేయ్‌ అని పవన్‌ కళ్యాణ్‌కు రోజా సవాల్‌ విసిరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను నిలదీశారు ఆర్కే రోజా. పవన్‌ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమేనని అన్నారు. గత ఎన్నికలలో ప్యాకేజీలు తీసుకుని బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశావని పవన్‌పై రోజా మండిపడ్డారు.