Andhra PradeshHome Page Slider

మెగాస్టార్ ఫ్యామిలీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా

◆ రోజా వ్యాఖ్యలపై చిరంజీవి అసహనం
◆ రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపిన చిరంజీవి
◆ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో సంబంధం లేదన్న చిరు
◆ రోజా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ నాగబాబు

ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మెగా బ్రదర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీలో సంచలనం కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు విమర్శలతో విరుచుకు పడే మంత్రి రోజా మెగా బ్రదర్స్ మొత్తాన్ని విమర్శించడంతో వివాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఇద్దరు సోదరులకు తమను అభిమానించిన ప్రేక్షకులకు గాని ప్రజలకు గానీ తమ సొంత ప్రాంతానికి గాని వారు ఎటువంటి సహాయం చేయలేదని అందుకే చిరంజీవితో పాటు ఆయన సోదరులు ఇద్దరు తమ సొంత ప్రాంతాల్లో పోటీ చేసి ఓడిపోయారని వారి ముగ్గురికి రాజకీయ భవిష్యత్తు లేదని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై నాగబాబు విరుచుకుపడ్డారు. చిరంజీవి మాత్రం రోజా వ్యాఖ్యలపై సున్నితంగా, కొంత అసహనం గా స్పందించారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా రాష్ట్రాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయడం మానేసి పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తోందని నాగబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు తమ సోదరులపై రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడిన పట్టించుకోలేదని ఆమెది నోరు కాదు కుప్ప తొట్టి అని నాగబాబు విమర్శించారు.

అయితే ఈ విషయంపై వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ రోజా చేసిన విమర్శలపై హుందాగా స్పందించారు. నాతో స్నేహంగా ఉండి నా సాయం తీసుకున్న వాళ్లు ఇప్పుడు సాయం తీసుకోలేదని చెబుతున్నారని కామెంట్లు చేశారని నేను ఎవరికి సహాయం చేశానో నాకు తెలుసని నా సహాయం తీసుకున్న వాళ్లకు కూడా తెలుసని చిరంజీవి పేర్కొన్నారు. నా గురించి తెలిసి మాట్లాడారో తెలీక మాట్లాడారో నాకు తెలియదని అయితే అలాంటి వాళ్లను నేను పట్టించుకోనని చిరంజీవి వెల్లడించారు. తన పేరు వాడకపోతే వాళ్లకు మనుగడ ఉండదని అందుకే వాళ్లు నా గురించి మాట్లాడుతున్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.అల్లు అరవింద్ ఫ్యామిలీతో ఎలాంటి గొడవలు లేవని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజకీయాల విషయంలో ఎవరి దారి వారిదేనని తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడని అతని తమ్ముడే అయినప్పటికీ స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ రాజకీయ వెనుక తాను ఉన్నట్లు అనడం సబబు కాదని తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి కుండ బద్దలు కొట్టారు. చిరంజీవి హుందాగా రియాక్ట్ అయిన తీరును నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. చిరంజీవి కామెంట్లపై రోజా స్పందిస్తారేమో చూడాలి.