పదివేల మంది మహిళలతో విజయనగరంలో మంత్రి రోజా భారీ ర్యాలీ
విజయనగరంలో అట్టహాసంగా తొలి మహిళా పార్కు ప్రారంభోత్సవం జరగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు రోజా, బొత్స సత్యనారాయణ పదివేల మంది మహిళలతో కలిసి భారీర్యాలీ నిర్వహించారు. మహిళలంతా వైసీపీ పార్టీకి చెందిన పాటలు స్పీకర్లలో వినిపిస్తుండగా ర్యాలీగా కదిలారు. కొందరు డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు. మంత్రి రోజా ఈ పార్కును రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ పదిహేడేళ్లపాటు విజయనగరం నుండి మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు జిల్లాకు ఏమి చేశారంటూ ప్రశ్నించారు. సెల్ఫీలు తీసుకుంటూ టిడీపీ అధినేత చంద్రబాబు, అశోక్ గజపతిరాజులు సెల్ఫిష్‌లుగా మారారని విమర్శలు చేశారు. వీరు జిల్లాను ఏరకంగానూ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లలో సర్వతోముఖాభివృద్ధి చేసి చూపించారన్నారు.