Andhra PradeshHome Page Slider

నారా బ్రాహ్మణీకి మంత్రి రోజా చురకలు

మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకెళ్తే ప్రజల మద్దతు కోరుతావా అని నారా బ్రాహ్మణిని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు మోసానికి 2019లోనే ప్రజలు మోత మోగించి, 23 సీట్లతో ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో నీ భర్త లోకేష్ కు మోత మోగించి ఓడించారని న్యాయవ్యవస్థకు మీరు అతీతులా అని నిలదిశారు. పాలకుల అక్రమాలను ప్రశ్నిద్దామని, నేటి రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దామంటూ పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని ప్రశ్నించారు. మంగళగిరిలో నీ భర్త లోకేశ్‌ను ప్రజలు ఓడించారన్నారు. అయినా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే మీ మామకు మద్దతుగా ఆందోళన చేస్తావా అని ట్వీట్ చేశారు.