పవన్ ఓ కుంభకర్ణుడు..అంటూ రోజా సెటైర్లు
పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడు అంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తను కుంభకర్ణుడిలా 6 నెలలు నిద్రపోయి , 6 నెలలు మేల్కొంటాడని విమర్మించారు. పవన్ ప్రభుత్వం పై చేస్తున్న విచిత్ర ట్వీట్ల పై ఆమె మండిపడ్డారు. ఒక స్టార్‌గా ఎదిగి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రాజకీయాలంటే ఆయనకు సిరియస్‌నెస్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు బీజేపీ , టీడీపీతో తిరిగినప్పుడు ఉత్తరాంధ్ర వలసలు కనిపించలేదా అని నిలదీశారు. సీఎం జగన్ పాలనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతోందని తెలిపారు.