Politicstelangana,

కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుసుకున్నారు. ఈ నెల 9న జరగబోయే తెలుగుతల్లి విగ్రహావిష్కరణకు ఆయనను రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, దానికోసం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌తో పాటు బీజేపీ పార్టీ నుండి కూడా  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర పండుగ అని, పార్టీలకతీతంగా ఈ వేడుకను జరుపుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే పొన్నం ప్రభాకర్ ఆహ్వానంపై కేసీఅర్ సమాధానంపై సమాచారం తెలియాల్సి ఉంది.