పొలం పనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
టిజి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొలం బాట పట్టారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆయన బుధవారం ఉదయం టీషర్ట్, తెల్లటి లుంగీ ధరించి తన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కల్లూరు మండలంలోని నారాయణపురంలోని తన వ్యవసాయ భూమిలో వేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కొంతసేపు మాట్లాడారు.

