ఐటీ కేసులో విచారణకు మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ
గత వారం ఐటీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కోసం ఐటీ శాఖ సిద్ధమవుతోంది. మల్లారెడ్డితోపాటు విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే 15 మందికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఉదయం పదిన్నరకు మల్లారెడ్డి తరుపున ఆయన చార్టెడ్ అకౌంటెంట్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీల వివరాలను వెంట తీసుకురావాలని అధికారులు, మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఆదేశించారు. ఐటీ రిటర్న్‌ల ఆధారంగా విచారణ సాగనుంది. కుటుంబ సభ్యులతోపాటు, మల్లారెడ్డి సంస్థలో పనిచేస్తున్న మరికొందరికి ఐటీ శాఖ నోటీసులిచ్చింది. విచారణకు నిర్దేశించిన సమయంలో హాజరుకావాలని ఇప్పటికే ఐటీ శాఖ సూచించింది. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి, మర్రి లక్ష్మారెడ్డి విచారణకు వచ్చారు. ఐటీ విచారణకు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజశేఖర్ రెడ్డి విచారణ కేంద్రానికి చేరుకున్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, రామస్వామి రెడ్డి విచారణకు హాజరయ్యారు. మరోవైపు నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ కాలేజీ ఛైర్మన్ నర్సింహారెడ్డి, కుమారుడు త్రిశూల్ రెడ్డి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు ఐటీ శాఖ విచారణకు 12 మంది హాజరయ్యారు.

