Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

విశాఖ పెట్టుబడుల సదస్సు విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ పిలుపు

విశాఖపట్నం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సును (Investment Summit) ఘనవిజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సహచర మంత్రులను పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనను త్వరగా నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలోని ఒప్పందాలు, పెట్టుబడి ప్రాజెక్టుల విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని లోకేశ్ సూచించారు. విశాఖ సదస్సు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.