మంత్రి కేటీఆర్ గొప్ప మనసు
ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడంలో మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారు. ఆదివారం జగిత్యాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మెదక్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదానికి వెంటనే స్పందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆయన కళ్ల ఎదుటే ఒక బస్సు, కారు ఢీకొన్నాయి. కారులోని ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనితో వెంటనే తాను వెళ్తున్న కాన్వాయ్‌ను ఆపిన కేటీఆర్ వారిని పరామర్శించి, తన వెంట ఉన్న వైద్యులతో చికిత్స చేయించారు. అంబులెన్స్ వచ్చే వరకూ ఆగకుండా తన కాన్వాయ్‌లనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనితో అక్కడ స్థానికులు మంత్రి గొప్పమనసును ఎంతో మెచ్చుకుంటున్నారు.