మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఏపీలో తెలంగాణ భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవస్థానాలలో బాగుండేదన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో దేవాలయాలకు వెళ్లాలంటే తెలంగాణ భక్తులకు కష్టంగా ఉందన్నారు. దురదృష్టవశాత్తూ శ్రీశైలాన్ని రాష్ట్ర విభజన వల్ల కోల్పోయామని పేర్కొన్నారు. అలాగే తిరుమల దేవాలయం ఏపీకి చెందడం వల్ల తెలంగాణ నుండి వచ్చే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు దర్శనానికి కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.