Home Page SliderTelangana

బోనాల పండుగపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

తెలంగాణా ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బోనాల పండుగలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా మంత్రి కొండా సురేఖ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణాలో వచ్చే నెల 7నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయన్నారు. అయితే ఈ బోనాలకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఈసారి బోనాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కాగా బోనాల గురించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ. 25 కోట్లు విడుదల చేయిస్తామన్నారు. మరోవైపు తెలంగాణా బోనాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కాగా దీనిపై పూర్తి సమాచారంతో త్వరలోనే క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.