నేడు, రేపు నల్లమలలో మంత్రి జూపల్లి పర్యటన
టిజి: పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు శుక్ర, శనివారాలలో నల్లమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక హబ్‌గా తీర్దిదిద్దడంలో భాగంగా మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అధ్యయనానికి వెళుతున్నారని పర్యాటక శాఖ తెలిపింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యేలు స్టడీ టూర్‌కు తమ అనుమతి తీసుకున్నారని అధికారులు తెలిపారు.

