NewsTelangana

మంత్రి జగదీష్ రెడ్డి రూటే సెపరేట్

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయ భిక్ష కాంగ్రెస్ పార్టీ పెడితే… ఆ పార్టీకి ద్రోహం తలపెట్టారంటూ విమర్శించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. అమిత్ షా సభకు జనాలను తరలించిందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినన్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానమంటూ జోస్యం చెప్పారు. రెండో స్థానంలో నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీలో చేరారంటూ రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుబంధు పథకం బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు పెట్టడం లేదంటూ ప్రజల్నుంచి వచ్చే విమర్శలకు మాత్రం బదులివ్వలేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రేమను మంత్రి చాటుకున్నారు.