Home Page SliderTelangana

నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేస్తామన్న మంత్రి హరీశ్‌రావు

తెలంగాణా ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఇవాళ సిద్ధిపేట రాంపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో నెల రోజుల వ్యవధిలో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వ్యవసాయానికి 3గంటల కరెంట్ మాత్రమే చాలంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ రుణమాఫీ పూర్తి కాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కాగా తెలంగాణాలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను  అమలు చేస్తూ అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.