Home Page SliderTelangana

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణాలో గతకొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణాలోని వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా గ్రామీణ అభివృద్ధి&నీటి పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ వరంగల్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన పరిమళ,జవహర్ కాలనీల్లో ముంపు ప్రాంత బాధితులను పరామర్శించారు. కాగా వరద బాధితులకు అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక  చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి వెంట ఎమ్మెల్యే ఆరూరి రమేష్,కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు.