టెన్త్ ఫలితాలను విడుదలు చేసిన మంత్రి బొత్స
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. టెన్త్ పరీక్షల్లో మొత్తం 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38శాతం పరీక్షల్లో పాసైయ్యారు. పదో తరగతి పరీక్షల్లో పార్వతీపురం జిల్లా టాప్‌లో నిలిస్తే, నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గతేడాదిదో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత 5శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు ఈ నెల 13 వరకు అవకాశమిస్తున్నట్టు మంత్రి చెప్పారు. జూన్ 2 నుంచి 10 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 17లోపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

