మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసులకు ఇకపై గుడ్‌బై చెప్పనుంది. శాశ్వతంగా స్కైప్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2003లో ప్రారంభించిన ఈ స్కైప్‌ను 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. 22 ఏళ్ల పాటు సేవలు అందించిన ఈ స్కైప్‌ను గతంలోనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినా అమలు పరచడంలో జాప్యమయ్యింది. ఇప్పటి వరకూ స్కైప్ వాడుతున్న వారు టీమ్స్ మారాల్సి ఉంటుందని వెల్లడించింది.

