స్కైప్ సేవలను నిలిపివేయనున్న మైక్రో సాఫ్ట్
మైక్రోసాఫ్ట్ స్కైప్ సేవల నిలిపివేతకు ఇటీవల గడువు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా మే 5 నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని అధికారికంగా ప్రకటించింది. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉచిత వినియోగదారు కమ్యూనికేషన్ ఆఫర్లను క్రమబద్ధీకరించడానికి, ఆధునిక కమ్యూనికేషన్లు, సహకార కేంద్రం అయిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ పై దృష్టి పెట్టడానికి మే 2025 లో స్కైప్ ను విరమించుకుంటున్నామని మైక్రోసాఫ్ట్ అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. అయితే ప్రస్తుత స్కైప్ వినియోగదారులు తమ డేటాను టీమ్స్ ప్లాట్‌ఫామ్‌కు మారాలని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ రాబోయే మూడు నెలల్లో స్కైప్ నుంచి టీమ్స్‌కు క్రమంగా మారాలని యోచిస్తోంది. టీమ్స్ ప్రారంభించినప్పటి నుంచి కంపెనీ ఈ మార్పును ప్రోత్సహిస్తోంది. స్కైప్ రిటైర్మెంట్ ప్రకటించిన బ్లాగ్ పోస్ట్‌లో కూడా రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఒకేలాంటి అనేక లక్షణాలను అందిస్తున్నాయని, అలాగే టీమ్స్ అదనపు సామర్థ్యాలను అందిస్తాయని పేర్కొంది.