RCB ఓటమిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న MI
ఈ IPL సీజన్‌లో నిన్న జరిగిన RCB VS GT మ్యాచ్‌లో RCB ఓటమిపాలయిన విషయం తెలిసిందే. దీంతో RCB ఈ IPL సీజన్‌లో ప్లేఆఫ్ అవకాశాలను పోగొట్టుకొని నేరుగా ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉత్కంఠగా సాగిన ప్లేఆఫ్ రేసులో MI చోటు దక్కించుకుంది. కాగా నిన్న RCB గెలుపోటములపై MI టీమ్ ప్లేఆఫ్స్ స్థానం ఆధారపడి ఉండేది. ఈ క్రమంలో MI టీమ్ RCB VS GT మ్యాచ్‌ను ఎంతో ఆసక్తికరంగా తిలకించింది. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లో RCB ఓడిపోవడంతో MI టీమ్ సంబరాలు చేసుకుంది. కాగా MI టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లిందని తెలిసి సూర్యకుమార్ యాదవ్ తన భార్యను ఆనందంగా హగ్ చేసుకున్నారు. దీంతో ఈ వీడియోను కాస్త ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకోగా ఇవి వైరల్‌గా మారాయి. కాగా ఈ వీడియో చూసిన MI ఫ్యాన్స్ ఈసారి MI ఖచ్చితంగా కప్ కొడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇన్ని సంతోష సంబరాల మధ్య IPL ట్రోఫీని ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.

