మహారద్దీగా మారిన ‘మెట్రో స్టేషన్లు’
సమ్మర్‌ఎఫెక్ట్‌తో హైదరాబాద్ మెట్రో స్టేషన్లు మహారద్దీగా మారాయి. ఇసుకవేస్తే రాలనంత జనం మెట్రోలలో, స్టేషన్లలో కనిపిస్తున్నారు. మండే ఎండల్లో స్కూటర్లలో తిరగలేక నగర జనం మెట్రోబాట పట్టారు. ముంబై, జపాన్‌లాంటి నగరాలలో మెట్రోలు చాలా రద్దీగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఆ సీన్ కనిపిస్తోంది. అమీర్ పేట్ జంక్షన్ మెట్రో అయితే ఇంక చెప్పనక్కరలేదు. దీనిలో నాలుగు రూట్లకు వెళ్లే మెట్రోట్రైన్లు ఉండడంతో ఈ మెట్రో స్టేషన్ రద్దీగా మారింది. గత వారం, పది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో జనం రోడ్డెక్కే పరిస్థితి లేదు. క్యాబ్‌లు, కార్లలో వెళ్లే స్తోమతలేని వారికి మెట్రో వరంగా దొరికింది. కానీ రద్దీ కారణంగా ఎప్పుడు గమ్యస్థానాలకు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. బోగీలు పెంచే ఏర్పాట్లు చేయమని ప్రయాణికులు కోరుకుంటున్నారు.