గోల్కొండలో మొదలైన మెట్ల పూజ
హైదరాబాద్: ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల జాతర సందడి ఆదివారం నుండి మొదలు కానుంది. గోల్కొండలో మొదలై నెల రోజుల పాటు జరిగే బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండలోని శ్రీ జగదాంబ అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు పూజలు చేశారు. రేపు గోల్కొండ కోటలో తొలి పూజ ప్రారంభమవుతుంది.