రాష్ట్రంలో వర్షాల అవకాశమని వాతావరణ కేంద్రం హెచ్చరిక
కోస్తాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అదే సమయంలో, వచ్చే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.