ప్రపంచ రికార్డ్ సృష్టించిన మెస్సీ
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్స్‌లో “మెస్సీ” ఒకరిగా ఉన్నారు. అర్జెంటీనాకు చెందిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కాగా ఈ రోజు కోపా అమెరికా టైటిల్‌ను అర్జెంటీనా దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మెస్సీ ప్రపంచంలో అత్యధిక ట్రోఫీలను (45) గెలుచుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే ఇందులో 39 డొమెస్టిక్,క్లబ్ ట్రోఫీలు కాగా మిగతావి ఇంటర్నేషనల్,వరల్డ్ కప్ ట్రోఫీలుగా ఉన్నాయి. కాగా మెస్సీ తర్వాత అత్యధిక ట్రోఫీలు పొందిన ప్లేయర్‌గా అల్వెస్-బ్రెజిల్(43) ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అషూర్-ఈజిప్ట్(39) నిలిచారు. మెస్సీ తన కెరీర్‌లో మొత్తం 1,068 మ్యాచ్‌లు ఆడగా.. 838 గోల్స్ చేసినట్లు తెలుస్తోంది.
