InternationalSports

ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ

ఇటీవలే ఫుట్‌బాల్‌లో వరల్డ్ కప్‌ను ఒడిసిపట్టిన లియొనల్ మెస్సీ. మరో అత్యుత్తమ అవార్డును కైవసం చేసుకున్నాడు. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియొనల్ మెస్సీ ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించారు. మెస్సీ ఫ్రాన్స్ స్టార్లు ఎంబాపె,కరీమ్ బెంజిమాను అధిగమించి ఫిఫా ఉత్తమ ఆటగాడి పురస్కారాన్ని దక్కించుకున్నాడు. అయితే గత 14 ఏళ్లల్లో ఆయన వరుసగా 7వ సారి ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. అయితే మహిళల ఉత్తమ క్రీడాకారిణిగా అలెక్సియా పెటెలాస్ (స్పెయిన్) రెండవసారి ఈ అవార్డును సాధించింది. కాగా ఈమె గత సీజన్లో  అన్నీ టోర్నీలల్లో మొత్తం 34 గోల్స్ కొట్టింది. ఇక ఉత్తమ కోచ్‌గా అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించిన లియొనల్ స్కాలోని ఎంపికయ్యారు. మహిళల్లో ఈ అవార్డును సరెనా వీగ్‌మాన్ దక్కించుకున్నారు. కాగా ఆమె యూరో ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ను విజయ పతంలో నడిపించింది. జాతీయ జట్ల కెప్టెన్లు,కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్టులు,ఫిపా దేశాల సభ్యులతో కూడిన ప్యానల్‌తోపాటు ఆన్‌లైన్ ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.