బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
అతి త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం ఖాయం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక బీఆర్‌ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత హరీష్‌రావుకు ఏమాత్రం లేదు. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తోందని, కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కోమటిరెడ్డి ఆరోపించారు.