విధులకు హాజరు కాని 77 మంది వైద్యులకు మెమోలు
తెలంగాణలోని వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 77 మంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడంతో కలెక్టర్‌తో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపరిండెంట్ కిషోర్ 77 మందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో ఓ ఒక్క రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇప్పటి వరకు జరగలేదని, ఇంత మందిపై చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమమని ఎంజీఎం ఉద్యోగులు అంటున్నారు.