రాణి ఎలిజబెత్ జ్ఞాపకాలు… ప్రతిభా భారతి ఏం చెప్పారంటే!
బ్రిటన్ రాణిగా సుదీర్ఘకాలం కొనసాగిన రాణి ఎలిజబెత్ తాజాగా కన్నుమూశారు. రాణి మరణంతో ఆమెతో అనుబంధంపై లెక్కలేనన్ని జ్ఞాపకాలు కన్పిస్తున్నాయి. బ్రిటన్ రాణి హోదాలో ఎలిజబెత్-2 ఎక్కెడెక్కడ పర్యటించారు? ఏఏ దేశాలకు ఎన్ని సార్లు వెళ్ళారు? ఆ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు? ఇలా ఆమెతో ఉన్న ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను ప్రపంచ దేశాలలోనివారు నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీలో మంత్రిగా… అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కావలి ప్రతిభా భారతి జ్ఞాపకాలు కూడా వెలువడ్డాయి.

అయితే టీడీపీ పార్టీ కూడా రాణి ఎలిజబెత్‌తో తమ పార్టీకి ఉన్న మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ జ్ఞాపకాలలో భాగంగా రాణి ఎలిజబెత్-2 తో ప్రతిభా భారతి కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదల చేశారు. 1983లో టీడీపీ తొలిసారిగా అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిభా భారతి నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మేల్యేగా పోటి చేసి గెలిచారు. దీంతో ఎన్టీఆర్ ఆమెను తన కేబినెట్‌లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా నియమించారు. కాగా అదే ఏడాది నవంబర్‌లో రాణి ఎలిజబెత్ -2 హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తరుపున ప్రోటోకాల్ మంత్రిగా ప్రతిభా భారతి వ్యవహరించారు.ఈ మేరకు ప్రతిభా భారతి బ్రిటన్ రాణి పర్యటన ఆద్యంతం ఆమెతోనే ఉన్నారు.

