Home Page SliderNational

కమల్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పిన థగ్ లైఫ్ సభ్యులు

విశ్వనటుడు కమల్ హాసన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 65 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా కమల్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఆయన నటుడిగా, రచయితగా, గాయకుడిగా, గీత రచయితగా, కొరియోగ్రాఫర్‌గా, మేకప్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈ సందర్భంగా మణిరత్నం తెరకెక్కిస్తోన్న థగ్ లైఫ్ చిత్రం యూనిట్ సభ్యులు కొత్త పంథాలో కమల్‌కు అభినందనలు తెలిపారు. షూటింగ్ సెట్‌లో రోడ్డుకిరువైపులా నిలబడి చప్పట్లు కొడుతూ ఆయనకు గ్రాండ్‌గా స్వాగతం పలికారు.