Home Page SliderInternational

మెహుల్ ఛోక్సీ అరెస్ట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం కేసులో కీలక నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. సీబీఐ అభ్యర్థన మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లుగా బెల్జియం పోలీసులు ఇవాళ ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో మెహుల్ ఛోక్సీతోపాటు ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయారు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ దర్యాప్తులో భాగంగా వారు దాదాపు రూ.13,500 కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లుగా అభియోగాలు నమోదు చేశారు. వారిపై ముంబై హైకోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.