“ఇంద్ర” రీరిలీజ్‌పై మెగాస్టార్ స్పందన..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం 4కే రీరిలీజ్‌లు ఎక్కువయ్యాయి. ఈ రీరిలీజ్‌లలో లేటెస్ట్‌గా సాలిడ్ హైప్‌ని సెట్ చేసుకొని వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఇంద్ర”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుటి నుండో ఎదురు చూస్తుండగా ఈసారి మెగాస్టార్ బర్త్ డే కానుకగా రీరిలీజ్‌కి తిరిగి వస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతుండగా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సాలిడ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా లేటెస్ట్‌గా సినిమాపై మెగాస్టార్ స్పందించారు. ఇందులో చిరు తన పవర్‌ఫుల్ డైలాగ్ ఇంద్ర, ఇంద్రసేనా రెడ్డి అంటూ ఈ డైలాగ్‌ని ఇప్పుడు చెప్పినా ఒళ్ళు గగుర్పొడుస్తుందని ఈ చిత్రం అంత పెద్ద హిట్ కావడానికి కారణం ఆ కథే అని అన్నారు..
ఇంద్ర సినిమాలో పాటలు, డాన్స్, డైలాగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, ఇలా అన్నీ పీక్స్‌కి వెళ్లడం మనం చూశాం. అలాగే ఇంద్ర కమర్షియల్ సినిమాలకి ఒక నిర్వచనం అంటూ ఎగ్సైట్ అయ్యారు. ఈసారి నా పుట్టినరోజుకి ఇంద్ర రీ రిలీజ్‌ని ప్లాన్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇది సాధ్యం అయ్యేలా చేసిన లేడీ నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లకి నా ధన్యవాదాలు అని మెగాస్టార్ తెలిపారు.

