Home Page SliderTelangana

 8 మంది హీరోయిన్లతో భారీ విజువల్ వండర్‌కు సిద్దమైన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి భారీ విజువల్ వండర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. బింబిసార మూవీ  దర్శకుడు వశిష్టతో ఈ సినిమాకు సిద్దమయ్యారు. దాదాపు 20 ఏళ్ల అనంతరం అంజి లాంటి సోషియో ఫాంటసీ చిత్రంలో నటించనున్నారు చిరు. రామ్ చరణ్‌కు కథ చెప్పేందుకు వెళ్లిన దర్శకుడు వశిష్ట కథను విన్న చిరంజీవి ఈ కథకు చాలా ఎగ్జైట్ అయ్యారు. తాను స్వయంగా ఈ చిత్రం చేసేందుకు ఒప్పుకున్నారు. గతంలో జగదేకవీరుడు- అతిలోక సుందరి, అంజి లాంటి సోషియో ఫాంటసీ చిత్రాలను చేసిన మెగాస్టార్ చాలాకాలం తర్వాత ఈ తరహా చిత్రంలో నటించబోతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఆగస్టు నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కావచ్చు. అంతేకాదు కళ్లు చెదిరేలా 8 మంది హీరోయిన్లు ఈ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. భోళా శంకర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.