Home Page SliderTelangana

‘పవన్‌’ను అనుకరించిన ‘మెగాస్టార్’

తన కొత్త చిత్రం ‘భోళా శంకర్‌’లో మెగాస్టార్ చిరంజీవి పవర్‌స్టార్‌ను అనుకరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వివరిస్తూ “ఇన్ని రోజులు, పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నన్ను, నా డైలాగ్స్, నా పాటలకు డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు నేను అందరినీ అలరించడానికి భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్‌లను అనుకరిస్తాను. ఆడియెన్స్ ఆనందిస్తారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ ఇన్ఫో ను ఇచ్చిన చిరు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని లీక్ చేశారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ‘ఖుషి’ నుండి ‘యే మేరా జహా’ పాటను ఇమిటేట్ చేస్తూ ఒక చిన్న క్లిప్‌ను విడుదల చేశాడు. ఇది మెగా అభిమానులకు శుభవార్త అని చెప్పాలి. థియేటర్లలో ఈ సీన్ కి మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం. ఇది శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఇంకా ఉంది అంటూ చెప్పుకొచ్చారు చిరు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గీలో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆగస్ట్ 11, 2023న గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.