శ్రీలీలకు మెగాస్టార్ కానుక..
మెగాస్టార్ చిరంజీవి యంగ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీలకు గొప్ప బహుమతినిచ్చారు. తన తాజా చిత్రం విశ్వంభరలో శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొన్న ఆమెకు మహిళాదినోత్సవం సందర్భంగా దుర్గదేవి ప్రతిమ గల శంఖాన్ని కానుకగా ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో శ్రీలీల ఈ చిత్రంలో ప్రత్యేకగీతంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకుంటోంది. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.