Home Page SliderTelangana

మెగాస్టార్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నిర్థారణకు ఉపయోగపడే స్క్రీనింగ్ టెస్టులు జూలై 9 నాడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని  ముందుగానే గుర్తిస్తే దానిని నివారించవచ్చు. ఈ ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ఆవరణలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసుకునే స్థోమత లేని కారణంగానే చాలామంది క్యాన్సర్ ముదిరిపోయేదాకా తెలుసుకోలేరు. అలాంటి వారందరికీ ఇది ఒక బంగారు అవకాశం.  క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తపడడం, రాగల ప్రమాదం ఉందేమోనని స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది. పదిమందికీ  ఉపయోగపడే ఇలాంటి క్యాంపులను నిర్వహించడం ద్వారా చిరంజీవి  ఆశయం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు స్టార్ హాస్పటల్స్ కూడా పాలు పంచుకుంటోంది. ఎయిమ్స్ లాంటి పేరు పొందిన ఆసుపత్రుల నుండి వచ్చిన డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్యాంపుకు వెళ్లి వారి సందేహాలను కూడా తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవల్సిందిగా చిరంజీవి ప్రకటించారు.