కాలినడకన తిరుమల చేరుకున్న మెగాహీరో
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని ఈ మెగా హీరో మొక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో హీరో సాయిధరమ్ తేజ్ మొక్కు చెల్లించేందుకు తిరుమలకు వచ్చారు.ఈ మేరకు ఆయన అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు.కాగా ఆయన వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.తన మామయ్య పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు హీరో సాయిధరమ్ తేజ్ ఆయన వద్దకు వెళ్లి ఆయనను హత్తుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా సంబరాలు చేసిన వీడీయోలు సోషల్ మీడియోలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

