Andhra PradeshNewsNews AlertTrending Todayviral

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌….!సీఎం చంద్రబాబు కీలక ప్రకటన….!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు కొత్త శుభవార్త చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నోటిఫికేషన్‌ విడుదల అనంతరం వెంటనే భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని, పాఠశాలలు ప్రారంభం నాటికి అన్ని పోస్టింగ్‌లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ పాలన నుంచి ప్రజలు విసిగిపోయి, ఇప్పుడు ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడంపై చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందుగా, డీఎస్సీ సిలబస్‌ కూడా కూటమి సర్కార్‌ విడుదల చేసింది. అలాగే, జూన్‌లో పాఠశాలలు ప్రారంభం అవ్వాలనుకుంటున్నవారు, ఆ సమయంలోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ – 6,371 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు , ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ – 1,781 పోస్టులు, గ్రాడ్యుయేట్ టీచర్ – 286 పోస్టులు, ప్రిన్సిపల్ – 52 పోస్టులు పీఈటీ టీచర్ – 132 పోస్టులు నియామక ప్రక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు విద్యాశాఖ అధికారులు చేయనున్నారు.