Home Page SliderTelangana

తెలంగాణ నిరుద్యోగుల మెగా ధర్నా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలిస్తామంటూ మభ్యపెడుతోందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున మెగా ధర్నా చేపట్టారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. వీరందరూ ఇందిరాపార్కులో ధర్నా చేపట్టారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో 3 వేల పోస్టులను పెంచాలంటూ కోరుతున్నారు. ఈ పరీక్షలను డిసెంబర్ వరకూ వాయిదా వేయాలని, జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.