బెంగళూరులో ‘వాల్తేర్ వీరయ్య’ కోసం మెగా ఆటో ర్యాలీ
‘వాల్తేరు వీరయ్య’కు కన్నడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి నిలబెట్టుకున్నాడు. మాస్ మహారాజ్ రవితేజతో కలిసి చిందులు వేసిన ‘పూనకాలు లోడింగ్’ పాటకు జనం పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా కర్ణాటకలో భారీ ర్యాలీతో తమ అభిమానాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. 154 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు నెటిజన్లు ‘మెగా మేనియా షురూ’ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ థియేటర్‌లో అభిమానులు పాటలను ఎంజాయ్ చేయడం చూసి, చాలా ఆనందించారు. తాను శ్రీదేవి, చిరంజీవి పాటకు లిరిక్స్ రాసి, కంపోజ్ చేసినప్పటి నుండీ అభిమానుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. మెగాస్టార్‌పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నానని పోస్ట్ పెట్టారు.

