కోమటిరెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణా కాంగ్రెస్ నేతల భేటి నేడు జరగనుంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే సారధ్యం వహించనున్నారు. ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇకముందు మరో ఎత్తు అంటున్నారు కోమటి రెడ్డి. ఎలక్షన్ల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడానికే ఈ భేటీగా వెంకటరెడ్డి చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఎన్నికలలో ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహాలు రచించనున్నట్లు సమాచారం. ఇదే కాక కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే వంటి ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. తెలంగాణలో బస్సుయాత్రకు కూడా సంకల్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయంపై కూడా చర్చలు జరిగే అవకాశాలున్నాయి.

