పార్లమెంట్‌లో జమిలి జగడం
ఒకే దేశం…ఒకే ఎన్నిక నినాదం లక్ష్యంతో తెర మీదకు తీసుకొచ్చిన బీజెపి మానస పుత్రిక జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంట్‌లో రగడ జరిగింది.న్యాయ శాఖ మంత్రి రామ్ మేఘ్‌వాల్ బిల్లును ప్రవేశపెడుతుండగానే కాంగ్రెస్ పార్టీ ఎంపిలు వ్యతిరేకించారు.కాంగ్రెస్ తో పాటు డిఎంకే,టిఎంసి,ఎంఐఎం తదితర ఎన్టీయే పక్ష పార్టీలు వ్యతిరేకించాయి.ఈ తరహా బిల్లులు చట్టరూపం దాల్చితే అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.అయినప్పటికీ జెపిసికి పంపడానికి నిర్ణయించారు.దీంతో లోక్ సభ స్పీకర్ జెపిసికి అనుమతిచ్చారు.అయితే జెపిసికి కూడా ఓటింగ్ పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఎలక్ట్రానిక్ విధానంతో తొలిసారిగా జెపిసిపై ఓటింగ్ కి అనుమతించారు.అలా కుదరని పక్షంలో సాధారణంగా బ్యాలెట్ ద్వారానూ ఓట్ చేయోచ్చని తెలిపింది.మొత్తం మీద బిల్లుకి అనుకూలంగా 269 ఓట్లు పోలవ్వగా,వ్యతిరేకంగా 198 పోలయ్యాయి.ఈ నేపథ్యంలో లోక్ సభ జమిలి బిల్లుని జెపిసి పంపడానికి ఆమోదం తెలిపింది.

