home page sliderNational

మేము బ్రతికే ఉన్నాం.. TRP కోసం మీడియా అసత్య ప్రసారాలు

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ వేరే జంట వీడియో తెచ్చి టీఆర్పీ కోసం కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఆ హనీమూన్ వీడియో ఉన్న అసలైన జంట సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేము బ్రతికే ఉన్నాం, ఆ వీడియో మాది, ఆ ఘటన సమయంలో మేమక్కడ లేము’’ అంటూ వీడియో లో వేడుకున్నారు. ‘‘ప్లీజ్ మా వీడియో ను ఇలా షేర్ చేయకండి.. పాపం ఆ దాడిలో చనిపోయే వారికి ఎంత బాధ కలుగుతుంది. మేము ఇంకా బ్రతికే ఉన్నాము.. మా వీడియో లకు RIP అనే కామెంట్లు కూడా పెడుతున్నారు. మాకు చాలా బాధగా ఉంది.. ప్లీజ్ ఇలా చేయకండి’’ అని వీడియోలో ప్రార్థించారు.